అటల్ పెన్షన్ యోజనా (APY)

అసంఘటిత రంగ కార్మికుల రిటైర్మెంట్ భద్రత కోసం అత్యంత ముఖ్యమైన పథకం

                

                        మీ భవిష్యత్తు గురించి మీరు చింతిస్తున్నారా మీ వృద్ధాప్యంలో మీ జీవనోపాధి ఎలా  అనె ఆలోచనలో ఉన్నారా అయితే త్వరపడండి, మన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వారందరికీ రూ 5000 లు లబ్ధి చేకూరాలని తమ శేష జీవితం నిశ్చింతగా గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమయ్యే పెన్షన్ నిధిని తమంతట తాముగా చేకూర్చుకునే విధంగా ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని మన ఏమిటి వారు ప్రవేశపెట్టారు ఈ పథకంలో మీరు నెలవారి చందా చెల్లించి మీ డబ్బును జమ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఇంత మంచి పథకం ఏంటా అని ఆలోచిస్తున్నారా, అదేనండి అటల్ పెన్షన్ యోజన పథకం. 

ఈ పథకం యొక్క పూర్తి సమాచారం మీకు అర్థమయ్యే తెలుగు భాషలో. 

  

 ఇందులో మీరు తెలుసుకునే విషయాలు క్లుప్తంగా :

*అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి 
*ఈ పథకంలో చేరడం వల్ల మీకు చేకూరే లాభాలు ఏమిటి
*ప్రతినెలా ఎంత పొదుపు చేయాలి & ప్రతి నెల ఎంత మొత్తం లో పెన్షన్ వస్తుంది
*ఎవరు అర్హులు
*ఎలా దరఖాస్తు చేసుకోవాలి
*ఎంత వయసు వారు అర్హులు
*మధ్యలోనే ఈఎంఐ ఆపేస్తే ఏం చేయాలి
*మీకు కలిగే సందేహాలు వాటికి సమాధానాలు

Atal Pension Yojana scheme

 

అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి :

                  భారతదేశంలో లక్షలాది మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, కూలీ కార్మికులు, చిన్న మరియు సన్నకారు రైతులు వంటి వారు సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అటల్ పెన్షన్ యోజనా (Atal Pension Yojana – APY) నెలసరి చిన్నమొత్తం చందాలతో వృద్ధాప్యం లో ఏళ్ల తర్వాత గ్యారంటీడ్ పెన్షన్ అందిస్తుంది వీరిలో చాలా మందికి రిటైర్మెంట్ తరువాత ఆదాయం ఉండదు. అటువంటి ప్రజలకు భవిష్యత్తులో భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ముఖ్యమైన సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజనా (Atal Pension Yojana – APY). 

ఈ పథకంలో వల్ల చేకూరే లాభాలు :

                  60 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత చెల్లింపుదారు పొందే ప్రయోజనాలు:

1. గ్యారంటీడ్ మినిమమ్ పెన్షన్

ప్రతి APY సబ్స్క్రైబర్ జీవితాంతం ఈ క్రింది నెలవారీ పెన్షన్‌లో ఏదో ఒకదాన్ని పొందగలడు:

* ₹1000
* ₹2000
* ₹3000
* ₹4000
* ₹5000

2. Subscriber మరణించిన తరువాత Spouse కి అదే పెన్షన్

Subscriber మరణించిన తరువాత వాటిని life-long spouse అందుకుంటారు.

3. ఇద్దరూ మరణించిన తరువాత Nominee కి మొత్తం Pension Corpus

పెన్షన్ సంపద మొత్తం నామినీకి చెల్లించబడుతుంది.

ఈ మూడు హామీల వల్ల APY భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రిటైర్మెంట్ స్కీమ్‌గా భావించబడుతుంది.

 

ప్రతినెలా ఎంత పొదుపు చేయాలి:

               ఇవి అటల్ పెన్షన్ యోజనా (APY) యొక్క కొన్ని ఉదాహరణలు — వినియోగదారు వయస్సు & కావలసిన పెన్షన్ మొత్తం పెన్షన్ ఆధారంగా నెలవారీ చందాదారుల మొత్తం:

వయస్సు (ప్రవేశ సమయంలో)    నెలవారీ పెన్షన్ - లక్ష్యం    అవసరమైన నెలవారీ చందా*
18 సంవత్సరాలు    ₹1,000    ₹42 
18 సంవత్సరాలు    ₹5,000    ₹210 
25 సంవత్సరాలు    ₹2,000    ₹151 
30 సంవత్సరాలు    ₹3,000    ₹347 
35 సంవత్సరాలు    ₹4,000    ₹722 
40 సంవత్సరాలు    ₹5,000    ₹1,454 

చందా చెల్లింపు ఎలా జరుగుతుంది?

 Monthly
 Quarterly
 Half-yearly

Auto-debit - ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి స్వయంగా డెడక్ట్ అవుతుంది.

 

                      కనీస పెన్షన్: ₹1,000 నెలకు &&  గరిష్ఠ పెన్షన్: ₹5,000 నెలకు. పెన్షన్ ప్రారంభమయ్యే వయస్సు → 60 సంవత్సరాలు

సభ్యుడు తనకు కావాల్సిన పెన్షన్  (₹1,000 / ₹2,000 / ₹3,000 / ₹4,000 / ₹5,000) ను ఎంపిక చేసుకోవచ్చు.
చందా మొత్తం మాత్రం సభ్యుడి వయస్సు + ఎంపిక చేసిన పెన్షన్ మొత్తం ఆధారంగా మారుతుంది.

                       ఇవి “సూచనాత్మక” విలువలు – వాస్తవ చందా కొద్దిగా మారవచ్చు.

 

APY ఎవరు అర్హులు: 

APY కోసం అవసరమైన అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి

భారతదేశ పౌరుడు కావాలి
18 – 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
 బ్యాంక్ లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి
ఆటో-డెబిట్ (Auto Debit) సౌకర్యం ఉండాలి
1st అక్టోబర్ 2022 నుండి – Income Tax Payee APY-లో చేరడానికి అర్హుడు కాదు.

అటల్ పెన్షన్ యోజనా ప్రధానంగా ఈ వర్గాల కోసం

 అసంఘటిత రంగ కార్మికులు
 చిన్న వ్యాపారులు
 కూలీలు, డ్రైవర్లు, హోటల్ వర్కర్లు
 ఆర్థికంగా బలహీన వర్గాల వారు
 రిటైర్మెంట్ ప్లాన్ లేకుండా జీవించే పేద & మధ్యతరగతి ప్రజలు

ఈ పథకం వృద్ధాప్యంలో ఆదాయం లేకపోవడం వలన కలిగే ఇబ్బందుల నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చు

 

APY పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

APY Online Registration Process

Net Banking ద్వారా దరకాస్తు చేసుకొనే విధానం

1. మీ బ్యాంక్ Net Banking వివరాలతో లాగిన్ అవ్వండి
2. Dashboard → “APY” select చేయండి
3. Nominee వివరాలు నమోదు చేయండి
4. Auto-debit consent ఇవ్వండి
5. Form submit చేయండి

NSDL Portal ద్వారా దరకాస్తు చేసుకొనే విధానం

1. Visit → [https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html](https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html)
2. Dashboard →  “Atal Pension Yojana”సెలెక్ట్ చెయ్యండి
3. “APY Registration” 
4. Aadhaar KYC options:    Aadhaar XML Upload

                                           Aadhaar OTP

                                           Virtual ID

5. వ్యక్తిగత వివరాలు → పెన్షన్ అమౌంట్ → ఫ్రిక్వెన్సీ (Monthly, quarterly, half-yearly) సెలెక్ట్ చేసుకోవాలి
6. Nominee వివరాలు నమోదు చేయండి
7. eSign → రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది

Offline విధానం

మీ బ్యాంక్/పోస్ట్ ఆఫీస్‌లో APY ఫారమ్ ఫిల్ చేసి సమర్పించవచ్చు.

 

ఎంత వయసు వారు APY పథకానికి అర్హులు:

                          18 – 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అసంఘటిత రంగం లో పని చేస్తున్న కార్మికులు మాత్రమే అర్హులు.

 

మధ్యలోనే ఈఎంఐ ఆపేస్తే ఏం చేయాలి:

                         అటల్ పెన్షన్ యోజనా (APY) లో మీరు మధ్యలోనే చందా (EMI) చెల్లింపులు ఆపేస్తే జరిగే ప్రభావాలు మరియు చేయాల్సినవి ఇలా ఉంటాయి:

🔸1. చందా ఆగిపోయిన వెంటనే జరగేది  ఏమిటి ?

మీ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోతే ఆటో-డెబిట్ విఫలం అవుతుంది.

ప్రతి మిస్ అయిన చందాపై పెనాల్టీ ఛార్జీలు పడతాయి:

₹100 కంటే తక్కువ చందా → ₹1 నెలకు

₹101–₹500 మధ్య → ₹2 నెలకు

₹501–₹1,000 మధ్య → ₹5 నెలకు

₹1,000 కంటే ఎక్కువ → ₹10 నెలకు

 

🔸2. ఎక్కువకాలం చందా చెల్లించకపోతే

6 నెలలు చందా ఆగిపోయితే → ఖాతా “ఫ్రోజెన్” అవుతుంది

12 నెలలు చందా ఆగిపోయితే → ఖాతా సస్పెండ్ అవుతుంది

24 నెలలు చందా ఆగిపోయితే → ఖాతా పూర్తిగా మూసివేయబడుతుంది

 

🔸 3. మళ్లీ చెల్లింపులు ప్రారంభించాలంటే ఏం చేయాలి?

మీ బ్యాంక్‌కి వెళ్లి లేదా నెట్‌బ్యాంకింగ్‌ / మొబైల్ బ్యాంకింగ్ ద్వారా
ఆటో-డెబిట్ రీ–యాక్టివేషన్ చేయించాలి.

పెండింగ్ చందాలు + పెనాల్టీలు ఆటోమేటిక్‌గా బ్యాంక్ డెబిట్ చేస్తుంది.

 

🔸 4. చందా కొనసాగించలేకపోతే / మధ్యలో ఆపేయాలనుకుంటే ఏమవుతుంది?

మీరు APY నుంచి బయటకు రావచ్చు (ప్రీమెచ్యూర్ ఎగ్జిట్):

ప్రమాదకర అనారోగ్యం / చందాదారు మరణం చెందినపుడు → పూర్తి డిపాజిట్ + వడ్డీని కుటుంబం పొందవచ్చు.

ఇతర సందర్భాల్లో → డిపాజిట్ చేసిన మొత్తంప్రభుత్వ సహకారం – ప్రాసెసింగ్ ఛార్జీలు కట్ చేసి మిగిలినది తిరిగి ఇస్తారు.

 

మీకు కలిగే సందేహాలు వాటికి సమాధానాలు:

APY లో సాధారణ సందేహాలు – FAQs.

ప్రశ్న  పెన్షన్ ఎప్పుడు లభిస్తుంది?

→ 60 సంవత్సరాలు పూర్తయ్యాక జీవితాంతం.

ప్రశ్న   Swavalamban  subscribers APYలో చేరవచ్చా?

→ అవును.

ప్రశ్న   Nomination తప్పనిసరా?

→ అవును, డిఫాల్ట్‌గా spouse నామినీ అవుతారు.

ప్రశ్న  చందా ఆలస్యం అయినట్లయితే?

→ Penalty + Overdue Charges ఉంటాయి.

ప్రశ్న  Aadhaar తప్పనిసరా?

→ KYC కోసం అవసరం అవుతుంది.

ప్రశ్న  40 సంవత్సరాలు దాటితే APYలో చేరవచ్చా?

→ కాదు.