లైసెన్ప్ ల కోసం వెయిటింగ్

చానల్స్ ప్రారంభించటానికి లైసెన్సులు దాఖలు చేసుకున్నప్పటికీ  రకరకాల కారణాలవలన లైసెన్సులు ఇంకా మంజూరు కాని తెలుగు చానల్స్ 20 దాకా ఉన్నాయి. వాటిలో న్యూస్, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆధ్యాత్మిక చానల్స్ ఉన్నాయి. ఎక్కువమంది మాత్రం మారిన నియమాల ప్రకారం న్యూస్ చానల్ కు 20 కోట్లు, నాన్-న్యూస్ చానల్ కు 5 కోట్లు నెట్ వర్త్ చూపించాలన్న నియమం వచ్చాక మౌనముద్ర దాల్చినవారే.

హెచ్ ఎం టీవీ ఏర్పాటు చేసిన కపిల్ చిట్ ఫండ్స్ అధిపతి వామన రావు ఇప్పటికే ఒక ఆంగ్ల దినపత్రిక కూడా ప్రారంభించగా ఒక కన్నడ చానల్, మరో ఇంగ్లిష్ చానల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనతా న్యూస్ పేరుతో శాటిలైట్ చానల్ కోసం దరఖాస్తు చేసుకొని ప్రస్తుతం కేబుల్ టీవీ నడుపుతున్న జనతా న్యూస్ మీడియా నెట్ వర్క్ ఇంకా లైసెన్స్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

ఇక కెసి టీవీ. చిరంజీవి చానల్ లైసెన్స్ రాలేదు,  తెలుగు వన్ డాట్ కామ్ సంస్థ అధిపతి కంఠంనేని రవిశంకర్  ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నుంచి టీవీ చానల్ కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్ లోనే ఉండిపోయింది. అదే విధంగా ఆర్వీఎస్ అనే ఎంటర్టైన్మెంట్ చానల్ నడుపుతున్న రావూరి వెంకటస్వామి (2009 ఎన్నికలలో  ఆర్వీఎస్ న్యూస్ పేరుతో మరో చానల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రాసెస్ లో ఉండగానే నిబంధనలు మారిపోవటంతో కొత్త నిబంధనలు నెరవేర్చకుండా వదిలేయటంతో లైసెన్స్ ఆగిపోయింది.

సూర్య దినపత్రిక అధిపతి నూకారపు సూర్యప్రకాశరావుకు చెందిన ఎస్పీఆర్ పబ్లికేషన్స్ సంస్థ తరఫున మూడు లైసెన్స్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎస్ 24 న్యూస్, ఎస్పీఆర్ టీవీ న్యూస్ అనే రెండు న్యూస్ చానల్స్ తో బాటు ఎస్పీఆర్ టీవీ భక్తి అనే మూడో చానల్ కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ మూడు దరఖాస్తులూ పెండింగ్ లోనే ఉన్నాయి. అదే విధంగా వెస్ట్ మారేడ్ పల్లి కేంద్రంగా పనిచేసే విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ  వి టీవీ పేరుతో ఒక చానల్ కు దరఖాస్తు చేసుకుంది. అది కూడా పెండింగ్ లో ఉంది.

దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న చానల్స్, వాటి వివరాలు

దరఖాస్తు  సంఖ్య

చానల్ పేరు

కంపెనీ పేరు

చిరునామా

తేదీ

1

CROSS TV

ఫిషర్ మెన్ క్రియేటివ్ వర్క్స్ పైవేట్ లిమిటెడ్

ఇంటి నెంబర్ : 10-3-3/8/B, ప్లాట్ నెం: 16/A,

ఈస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్ – 500026

08/07/2011

2

CHANNEL 4

ఫోర్త్ ఎస్టేట్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్

203. శ్రీనివాస కాలనీ వెస్ట్ , అమీర్ పేట్

హైదరాబాద్ – 500038

04/02/2011

3

HMTV ENGLISH

హైదరాబాద్ మీడియా హౌస్ లిమిటెడ్

ప్లాట్ నెం :6, అణుపురం కాలనీ, డా. ఎ. ఎస్ రావు నగర్, ఇసిఐఎల్ పోస్ట్, హైదరాబాద్ – 500062

04/04/2011

4

HMTV KANNADA

హైదరాబాద్ మీడియా హౌస్ లిమిటెడ్

ప్లాట్ నెం :6, అణుపురం కాలనీ, డా. ఎ. ఎస్ రావు నగర్, ఇసిఐఎల్ పోస్ట్, హైదరాబాద్ – 500062

04/04/2011

5

JANATA NEWS

జనతా న్యూస్ మీడియా నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్

504, పయఘా ప్లాజా, బషీర్ బాగ్,

హైదరాబాద్ –  500029

02/12/2010

6

KC TV

న్యూ వేవ్ ఇన్ఫోమీడియా ప్రైవేట్ లిమిటెడ్

ఎ-12, చంద్రలోక్ కాంప్లెక్స్ , రోడ్ నెం : 2,

ఫిల్మ్ నగర్, జుబిలీ హిల్స్, హైదరాబాద్ – 500033

21/04/2011

7

TONE TELUGUONE

అబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లిమిటెడ్

8-3-988/34/7/2/1/2, కమలాపురి కాలనీ,

శ్రీనగర్ కాలనీ రోడ్, హైదరాబాద్- 500073

04/08/2010

8

RVS NEWS

ఆర్ వి ఎస్ నెట్ వర్క్ ఇండియా లిమిటెడ్

6-3-630/ఎ, ఆనందనగర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్-500004

06/06/2011

9

HB TV

రెయిన్ బో వరల్డ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్

ఇంటి నెం: . 13ఎ,  ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెం:.12, బంజారా హిల్స్ హైదరాబాద్ -500034

25/08/2011

10

RTV JUNIORS

రాయుడు విజన్ మీడియా లిమిటెడ్

2-3-703/I/B, తిరుమల నగర్, అంబర్ పేట్, హైదరాబాద్- 500013

03/11/2010

11

RTV PULSE

రాయుడు విజన్ మీడియా లిమిటెడ్

2-3-703/I/B, తిరుమల నగర్, అంబర్ పేట్, హైదరాబాద్- 500013

03/11/2010

12

6 TV NEWS

సంయుక్త బ్రాడ్ కాస్టింగ్  (ఇండియా)  ప్రైవేట్ లిమిటెడ్

ప్లాట్ నెం. 210, ఎస్ ఎస్ ఎస్టేట్, రోడ్ నెం;.1, బంజారా హిల్స్,  వెంగళరావు పార్క్ మెయిన్ గేట్ ఎదురుగా,  హైదరాబాద్-500034

19/01/2011

13

DASARI

సౌభాగ్య ఎక్స్ పోర్ట్స్

లిమిటెడ్

ప్లాట్ నెం.512, రోడ్ నెం. 31, జుబిలీ హిల్స్ , హైదరాబాద్- 500033

31/05/2011

14

DASARI MOVIES TV

సౌభాగ్య ఎక్స్ పోర్ట్స్

లిమిటెడ్

ప్లాట్ నెం.512, రోడ్ నెం. 31, జుబిలీ హిల్స్ , హైదరాబాద్- 500033

31/05/2011

15

DASARI MUSIC TV

సౌభాగ్య ఎక్స్ పోర్ట్స్

లిమిటెడ్

ప్లాట్ నెం.512, రోడ్ నెం. 31, జుబిలీ హిల్స్ , హైదరాబాద్- 500033

31/05/2011

16

UDAYAM TV

సౌభాగ్య ఎక్స్ పోర్ట్స్

లిమిటెడ్

ప్లాట్ నెం.512, రోడ్ నెం. 31, జుబిలీ హిల్స్ , హైదరాబాద్- 500033

31/05/2011

17

S24 NEWS

ఎస్ పి ఆర్ పబ్లికేషన్స్

ప్రైవేట్ లిమిటెడ్

సూర్య సౌధ, ప్లాట్ నెం. 2-58/1/185, ఖానామెట్ శేరిలింగంపల్లి మండలం, హైదరాబాద్- 500033

09/08/2011

18

SPRTV BHAKTI

ఎస్ పి ఆర్ పబ్లికేషన్స్

ప్రైవేట్ లిమిటెడ్

సూర్య సౌధ, ప్లాట్ నెం. 2-58/1/185, ఖానామెట్ శేరిలింగంపల్లి మండలం, హైదరాబాద్- 500033

09/08/2011

19

SPRTV NEWS

ఎస్ పి ఆర్ పబ్లికేషన్స్

ప్రైవేట్ లిమిటెడ్

సూర్య సౌధ, ప్లాట్ నెం. 2-58/1/185, ఖానామెట్ శేరిలింగంపల్లి మండలం, హైదరాబాద్- 500033

09/08/2011

20

V TV

విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్

22-23, సర్వసుఖి సొసైటీ, వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్ – - 5000026

25/08/2011

 

 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>