భారీగా పెరిగిన ఏపీ ప్రభుత్వ ఆదాయం!

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాది మొదటి రెండు క్వార్టర్లలో కమర్షియల్ ట్యాక్స్‌ 11 వేల 300 కోట్ల రూపాయలు వసూలు అయింది. ఈ ఏడాది 12, 881 కోట్ల రూపాయలు వసూలైంది. ఎక్సైజ్ ఆదాయం గత ఏడాది 1536 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 1700 కోట్ల రూపాయలు వసూలైంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాది 652 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 1800 కోట్ల రూపాయలు వసూలైంది.

రవాణా శాఖ గత ఏడాది ఆదాయం 709 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 888 కోట్ల రూపాయలు వసూలైంది. గనుల శాఖ ఆదాయం గత ఏడాది 361 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 420 కోట్ల రూపాయలు వసూలైంది. మొత్తం రెండు త్రైమాసికాల్లో గత ఏడాది 14 వేల 737 కోట్ల రూపాయలు వసూలు కాగా, ఇప్పుడు 17 వేల 329 కోట్లు వసూలు అయ్యాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>