జర్నలిస్టులకు త్వరలోనే హెల్త్‌కార్డులు : అల్లం
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మంత్రి కేటీఆర్, సీఎం పేషీ అధికారులతో సమావేశమై హెల్త్ కార్డులపై చర్చించారు. సమావేశం ముగిసిన అల్లం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జర్నలిస్టులు అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఆ ప్రభుత్వం నేడో రేపో హెల్త్ కార్డులు అందించనుంది.